ములుగు,(ఆరోగ్యజ్యోతి): నుగురు వెంకటాపురం ప్రజల ఫిర్యాదు చేయడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఆదేశాల మేరకు డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు వెంకటాపురంలో ఆర్ఎంపీలు ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్న (LAB)రక్త పరీక్ష ,మూత్ర పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం జరిగింది.డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ తనిఖీల్లో భాగంగా ఆర్ఎంపి నిర్వహిస్తున్న సాయి లీల క్లినిక్ పరిశీలించగా,8 బెడ్స్ వేసి పేషెంట్స్ కి వైద్యం అందిస్తున్నరు. అక్కడికి వచ్చిన పేషెంట్లను వివరాలను అడగగా ప్లేట్లెట్స్ తగ్గాయ అని చెప్పి మాకు డాక్టర్ వైద్యం అందిస్తున్నట్లు వారు డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ తెలిపారు. ఈరోజు ఉదయంన 7 గంటలనుండి 12 గంటల వరకు చేసిన వైద్యానికి బిల్లు 6 వేలరూపాయల బిల్ వేశారని డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ దృష్టికి తీసుకవేల్లినారు.అలాగే ఇదే క్లినిక్లో వెనకాల ప్రత్యేక గదిలో ఎటువంటి అనుమతులు లేకుండా ప్రగతి డయాగ్నస్టిక్ సెంటర్ నడుపుతున్నట్లు గుర్తించారు. క్లినిక్ ను సీజ్ చేయడం జరిగింది . అనంతరం డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ మాట్లాడుతూ క్లినికల్ యాక్ట్ 2005 చట్టం ప్రకారం ఎటువంటి అనుమతులు , రిజిస్ట్రేషన్ లేకుండా నడపకూడదు అని తెలుపుతూ,ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి , క్లినిక్లను నడిపించిన అయితే వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ తనిఖీలో డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు గారితో పాటు డాక్టర్ సాయి కృష్ణ ల్యాబ్ టెక్నీషియన్ గురుదేవ్ రాఘవులు పాల్గొన్నారు