కాంట్రాక్ట్ వైద్యులను రెగ్యులర్ చేయండి

      కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

కలెక్టర్ ని కలిసిన తెలంగాణ ఒప్పంద వైద్యుల సంఘం సభ్యులు

 ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్యులను రెగ్యులర్ వైద్యులుగా నియమించాలని తెలంగాణ ఒప్పంద వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గా జిల్లా ఒప్పంద వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ సందీప్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి సమయంలో రెగ్యులర్ వైద్యులతో సమానంగా సేవలు అందించామని  తెలిపారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఒప్పంద వైద్యులకు శాశ్వత ప్రాతిపదిక నియామకాలు చేపట్టాలని అయన ప్రభుత్వాన్ని కోరారు. గత రెండు సంవత్సరాలుగా అధికారులకు  తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పిస్తున్న ఉన్నప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఈ సందర్భంగా వారు తెలిపారు. చాలీచాలని వేతనాలతో రోగులకు సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం తమను గుర్తించడం లేదని అయన ఆవేదన వ్యక్తం చేసినారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను రెగ్యులర్ చేయనట్లయితే ముక్కుమ్మడిగా  రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఒప్పంద వైద్యుల సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ వినోద్ ,కార్యదర్శి డాక్టర్, హరీష్ ,డాక్టర్ రత్నమాల ,డాక్టర్ శజియ డాక్టర్ రహుప్  దితరులు పాల్గొన్నారు.