కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
ఉట్నూర్,(ఆరోగ్యజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీవో నెంబర్ 60 లో ప్రకటించిన విధంగా పి ఆర్ సి లో అన్యాయం జరిగిందని తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ సుభాష్ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉట్నూర్ ఆసుపత్రి ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి ఆర్ సి కమిటీ నివేదిక సిఫారసు చేసిన కనీస వేతనం 19 వేల రూపాయలు ఉండగా దానికి భిన్నంగా అధికారులు కేవలం 15 వేల ఆరు వందలు మాత్రమే పిఆర్సి జీవో నెంబర్ 60 లో చేర్చడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పి ఆర్ సి జీవో నెంబర్ 60 సవరించి ఆరోగ్య శాఖ ఉద్యోగుల న్యాయమైన వేతనం ఇచ్చి అధికారులు ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చాంగొన, ల్యాబ్ టెక్నీషియన్ వీణ ,డి ఈ ఓ భాను ప్రసాద్, మనీ, లీతుబాయి, రాకేష్, బిక్కు తదితరులు పాల్గొన్నారు.