విధులు విస్మరిస్తే చర్యలు తప్పవు

కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

సీజనల్ వ్యాధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి

పి హెచ్ సి లో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలి

వైద్యుల సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

 ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ప్రతి వైద్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి సమయపాలన పాటించి విధులు నిర్వహించాలని లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాతోడ్ అన్నారు. గురువారం నాడు సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమావేశ మందిరంలో వైద్య అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాల్సి బాధ్యత వైద్యులపై ఉందన్నారు. మెడికల్,పార మెడికల్ సిబ్బంది అందుబాటులో  ఉంటూ సమయపాలన పాటిస్తూ రోగులకు వైద్య సేవలు అందించే విధంగావైద్య అధికారులు  చూడాలన్నారు. సబ్ సెంటర్ అనుబంధ గ్రామాల్లో పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్యులకు సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య శాఖకు అమలు చేస్తున్న ఫథకలను  సక్రమంగా నిర్వహించి ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కొన్ని ప్రభుత్వ పథకాలు ప్రారంభించే సమయంలో సంబంధిత ప్రజాప్రతినిధులను గ్రామ పెద్దల సమాచారం ఇచ్హి వారు  సమక్షంలో కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాలను పకడ్బందీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఉప ఆరోగ్య కేంద్రాలు అనుబంధ గ్రామాల్లో కూడా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. ప్రస్తుతం కరోన  సమయమని ఇదే సమయంలో సీజనల్ వ్యాధులు కూడా ప్రారంభం అవుతున్నాయని అన్ని గ్రామాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది విజిట్ చేయాలని తెలిపారు. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సిబ్బంది తెలపాలని సూచించారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన అన్ని విషయాలు కమిటీ దృష్టికి తీసుకు పెళ్లి సమీక్షించిన అనంతరం నిర్ణయాలు తీసుకోవాలనివైద్య అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించి మొక్కలు నాటాలని తెలిపారు. గత ఏడాది ఉట్నూర్  డివిజన్ లోని దంతాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హరితహారం కార్యక్రమం లో భాగంగా చెట్లు నాటడం జరిగిందని ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి  ప్రభుత్వం తరపున అవార్డు వచ్చిందని తెలిపారు .ప్రతి ఆరోగ్య కేంద్రంలో హరితహరంలో భాగంగా మొక్కలు నాటలని  తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా క్లోరినేషన్ చేయించాలని గ్రామ సర్పంచ్ లతో సమావేశాలు ఏర్పాటు చేసి వ్యాధులు రాకుండా చర్యల గురించి వివరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సూచించారు.ఈ కార్యక్రమంలో ట్రైబల్ అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ ,డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సాధన, జిల్లా సర్విలేన్స్ అధికారి డాక్టర్ వై సి శ్రీనివాస్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయ సారథి, జిల్లా మలేరియా నివారణాధికారి డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వార్, క్షయ నివారణ అధికారి డాక్టర్ ఈశ్వర్ రాజ్, ఎన్ సి డి అధికారి డాక్టర్ క్రాంతి, . ఎంపిహెచ్ ప్రోగ్రాం అధికారిని డాక్టర్ నవ్య సుధ వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రలనుడి వచ్చిన వైద్య అధికారులు తదితరులు  పాల్గొన్నారు.