వైద్య ఉద్యోగులందరికీ పిఆర్సి వర్తింపచేయాలి

 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న వైద్య ఉద్యోగులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపి ఆర్ సి ని మంజూరు చేయాలని తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బండారి కృష్ణ ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. హెల్త్ మిషన్ ఉద్యోగులకు పిఆర్సి లో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 2017 సంవత్సరంలో టిఎస్పిఎస్ స్టాఫ్ నర్స్ లకు ఇటీవల ఉద్యోగాలు ఇచ్చారని అదే తరహాలో ల్యాబ్ టెక్నీషియన్ లకు, ఏఎన్ఎంలకు ,ఫార్మసిస్ట్  ఉద్యోగాలు వెంటనే కౌన్సిలింగ్ కి పిలిచి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 60 ప్రకారం ఉద్యోగులందరికీ వేతనాలు పెంచారని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 3 కేటగిరీల్లో వేతనాలు పెంచాలని వారుకోరారు.