కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
జిల్లా వ్యాప్తంగా ఏడు స్టాఫ్ నర్స్ పోస్టులు ఖాళీలు
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లా
వ్యాప్తంగా గత కొంత కాలంగా స్టాఫ్ నర్స్ పోస్టులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పోస్టులు
ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో7 స్టాఫ్ నర్స్
పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తలమడుగు, నర్సాపూర్ -టి ,బేల, తాంసీ ప్రాథమిక
ఆరోగ్య కేంద్రాల్లో తో పాటు బోథ్ ప్రభుత్వ
ఆసుపత్రిలో మూడు స్టాఫ్ నర్స్ పోస్టులు కొంత కాలంగా ఖాళీగా ఉన్నాయి. అయితే ఇటీవల
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డి ఎంఇ, వైద్య ఆరోగ్య శాఖ, వైద్య విధాన
పరిషత్ లలో ఖాళీగా ఉన్నా పోస్టులను భర్తీ
చేసేందుకు కౌన్సెలింగ్ నిర్వహించారు . దాదాపు 3000 కు పైగా స్టాఫ్ నర్స్ పోస్టులను ఈ కౌన్సెలింగ్
ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ కౌన్సిలింగ్ నైనా పోస్టులు భర్తీ అవుతాయి అధికారులు
చెబుతున్నారు. తాంసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తో పాటు బోథ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు స్టాఫ్ నర్స్ పోస్టులు
ఎంపిక చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా
వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ అడగగా కౌన్సెలింగ్ పూర్తి అయిన వెంటనే ఈ
నెల 21న ఆర్డర్ కాపీలు
హైదరాబాద్లో జారీ చేశారని తెలిపారు.స్టాఫ్ నర్స్ పోస్టులు ఎంపిక అభ్యర్తులు ఆదిలాబాద్
రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి కి ఎక్కువ మొగ్గుచూపుతున్నట్లు
తెలుస్తోంది.