సింగరేణి భవన్‌ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన

ఛైర్మన్‌ & ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌

భద్రాది కొత్తగూడెం,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సింగరేణి వ్యాప్తంగా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా నిర్వహించారు.హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌ లో బుధవారం (జూన్‌ 2వ తేదీ) నాడు సంస్థ సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని జాతిపిత మహాత్మగాంధీ, తెలంగాణ తల్లి, తెలంగాణా సిద్ధాంత కర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇ.డి.కోల్‌ మూమెంట్‌ శ్రీ జె.ఆల్విన్‌, అడ్వయిజర్లు శ్రీ డి.ఎన్‌.ప్రసాద్‌, శ్రీ కె.సురేంద్రపాండే, జి.ఎం. కో-ఆర్డినేషన్‌ & మార్కెటింగ్‌ శ్రీ కె.సూర్యనారాయణ, అధికారుల సంఘం జనరల్‌ సెక్రటరీ శ్రీ ఎన్‌.వి.రాజశేఖర్‌ రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీ ఎన్.భాస్కర్ లు పాల్గొన్నారు.కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు శ్రీ ఎస్‌.చంద్రశేఖర్‌ (ఆపరేషన్స్‌), శ్రీ ఎన్‌.బలరాం (ఫైనాన్స్‌, పి&పి, పా) శ్రీ డి.సత్యనారాయణ రావు  (ఇ&ఎం) లు అతిథులుగా పాల్గొని తెలంగాణా తల్లి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాలకు, అమర వీరుల స్థూపాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ శ్రీ ఎస్‌.చంద్రశేఖర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సింగరేణి విస్తరించిన 6 జిల్లాల్లో గల 11 ఏరియాల్లో స్థానిక ఏరియా జనరల్‌ మేనేజర్లు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అమర వీరుల స్థూపలకు పూలమాళలు వేసి నివాళులు అర్పించారు. అన్ని చోట్లా కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించారు.