ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య
శాఖలో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్, కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్ సిబ్బందికి
ప్రభుత్వం వెంటనే పిఆర్సి ప్రకటించాలని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్
ఎంప్లాయర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వార్
,కన్వీనర్ బండారి కృష్ణా లు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. జులై 1 2018 తర్వాత
రిక్రూట్మెంట్ అయిన పబ్లిక్ హెల్త్ డాక్టర్లకి వైద్యవిధాన పరిషత్ మరియు
కాంట్రాక్టర్స్ వర్కర్సికి ముఖ్యమంత్రి
పిఆర్సి వర్తింప చేయాలని వారు కోరారు .అలాగే నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న
సిబ్బందికి కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బంది కి కూడా పిఆర్సి వర్తింపచేయాలని
కోరారు. ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సత్వజిగూడ సబ్ సెంటర్ లో
పనిచేస్తున్న 2వ ఏఎన్ఎం రాథోడ్ సునీత రోడ్డు ప్రమాదంలో మరణించింది వారి
కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్
జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రగాఢ సానుభూతిని తెలిపినారు. మృతిరాలి కుటుంబంలో
ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతోపాటు ఎక్స్గ్రేషియా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు
డిమాండ్ చేశారు