భద్రాది కొత్తగూడెం,(ఆరోగ్యజ్యోతి):కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నకిలీ విత్తనాల విక్రయం, రాబోయే వర్షాకాలంలో వేయబోయే పంటలపై వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఈ సమీక్ష సమావేశం లోని ముఖ్యాంశాలను చుచించారు.
నకిలీ విత్తనాల పై నిఘా పెట్టండి.
·
లైసెన్స్ లేని
వ్యాపారులు విత్తనాలు అమ్మితే PD act నమోదు చేయాలి.
· నకిలీ విత్తనాల మోసగాళ్లు పై అవసరమైతే టడా కేసులు పెట్టండి.
· వ్యవసాయ సీజన్ లో ఎరువుల వ్యాపారుల పై టాస్క్ఫోర్స్ బృందాలు నిఘా పెట్టాలి.
· రైతు వేదిక లోనే రైతులకు కు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి.
· పంటల కొనుగోలు లో మోసాలు జరిగితే సహించేది లేదు.
· లైసెన్సు ఉన్న ఎరువులు విత్తనాలు అధిక ధరలకు విక్రయించి వద్దు.
· వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ చేయాలి.రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలితూకాల్లో మోసాలు చేస్తే సహించేది లేదు, వారిపై క్రిమినల్ కేసులు పెడతా.రైతులను చైతన్యం కలిగించండి.రైతులకు అన్యాయం జరిగితే అధికారులదే బాధ్యత.
· రైతులు ధాన్యం తడిసి పోకుండా చర్యలు చేపట్టండి.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కురుస అభిమన్యుడు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మరియన్న,ADA లు కరుణశ్రీ, లాలు చంద్,AO రాజేశ్వరి, శంకర్, గోపాల్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.