అంకోలి లో ప్రారంభమైన కుష్టి వ్యాధి సర్వే

       కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆయా గ్రామాల్లో కుష్టి వ్యాధి సర్వే ప్రారంభించారు. ఈ సర్వే కె ఆర్ కె కాలనీ, టైలర్స్ కాలనీ, రాంనగర్, భీంసరి, రాంపూర్, యాపల్ గూడా, బంగారిగూడ తదితర గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని సూపర్వైజర్ సురేష్ తెలిపారు. మండలంలోని 34 గ్రామ పంచాయతీలు 101 గ్రామాలు, 13 సబ్ సెంటర్లు, 89 వేల పాపులేషన్ లో ఈ సర్వే నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మొదటగా ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి లెప్రసి సర్వే నిర్వహిస్తారని తెలిపారు ,ఒకవేళ అనుమానిత కేసులు ఉన్నట్లయితే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించడం జరుగుతుందని, అక్కడ వైద్యులు పరీక్షించి వారికి కూడా ఏదైనా అనుమానం వస్తే జిల్లా కేంద్రానికి పంపించి నిర్వహిస్తారని తెలిపారు. ఒక ఆశ కార్యకర్త ప్రతిరోజు 25 గృహాల్లో సర్వే నిర్వహిస్తుందని తెలిపారు ఆరు నెలల్లోగా ఈ సర్వే పూర్తి చేయవలసి ఉంటుందని ప్రజలందరూ ఈ సర్వేకు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.




కే ఆర్ కే కాలనీలో కుష్టి వ్యాధి సర్వే నిర్వహిస్తున్న దృశం