కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ప్రభుత్వం
నిర్ణయించిన నిర్ణయాల మేరకు అర్హులైన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం
జరుగుతుందని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయ సారథి అన్నారు. శనివారం
నాడు శిశుమందిర్ లో జరుగుతున్న వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్
ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు టీచర్ లందరికీ వ్యాక్సిన్
ఇస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్ ఇవ్వడం నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు.
ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ఈ
కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు శకుంతల, శ్రీ వాణి,సి లలిత, ఈశ్వరి, లలిత ఆశా
కార్యకర్తలు సునీత ,సుజాత, పుష్పలత ,రంగ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.