--ఎం.ఎల్.ఏ వనమా వెంకటేశ్వరరావు
భద్రాది కొత్తగూడెం ,(ఆరోగ్యజ్యోతి): కోవిడ్ మహమ్మారి విజృంభిస్తు, కుటుంబాలను నాశనంచేస్తున్న ప్రస్తుత తరుణంలో అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని,కోవిడ్ ను పారదోలాలని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక బొల్లోరిగూడెం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నుండి నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను వనమా పరిశీలించారు. ఈసందర్బంగా వనమా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సినేషన్ వేయడమే కె.సి.ఆర్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. చిరు వ్యాపారులు, కిరాణా, క్లౌరశాలలు, అల్పాహార బండ్లు, మోసం విక్రయదారులకు రోజుకు 400 మందికి మున్సిపాలిటీ ద్వారా వ్యాక్సినేషన్ వేయించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వనమా,కోరారు. ఈ కార్యక్రమంలో టీ.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు,డి.సి.ఎం.ఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జిల్లా వైద్య శాఖ అధికారిణి డాక్టర్ శిరీష, DCHS ముక్కంటేశ్వరరావు, మున్సిపాలిటీ కమిషనర్ శ్రీకాంత్, టీ.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్,చింతా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.