ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దస్నాపూర్ కాలనీలో డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదు అయింది. డెంగ్యూ కేస్ నమోదు కావడంతో అక్కడ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డెంగ్యూ కేస్ పరీక్షించడానికి మలేరియా శాఖ నుండి బి రఘునాథ్ వచ్చి కేసు ను పరిశీలించారు. ఆయన వెంట అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ సురేష్, ఏఎన్ఎం శకుంతల ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దస్నాపూర్ కు చెందిన ఆకుల చరీష్ కు 23 న డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని వారు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స నిమిత్తం రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)ఆస్పత్రిలో చేర్చడం జరిగిందని వారు పేర్కొన్నారు. చుట్టుపక్క ప్రాంతాల్లో స్ప్రి చేయడం జరిగిందని సురేష్ వివరించారు.