- లాక్ డౌన్‌ను పూర్తిగా ఎత్తేస్తూ
కేబినెట్ నిర్ణయం
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణలో లాక్ డౌన్‌ను పూర్తిగా
ఎత్తేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి
వచ్చిందన్నారు. వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్.. ఈ
మేరకు లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన
అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్
ఆదేశించింది. కరోనా కేసులు విజృంభించడంతో తొలుత మే 14 నుంచి 20 వరకు లాక్‌డౌన్ ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నాలుగు గంటల పాటు లాక్‌డౌన్ సడలింపు ఇవ్వగా... ఆ
తర్వాత మే 21 నుంచి 31 వరకు మరోసారి లాక్‌డౌన్ పొడిగించారు. అయితే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుందని
ప్రభుత్వం పేర్కొంది. అయితే జూన్‌లో మరోసారి లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంది.
జూన్ 1 నుంచి 10 వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం
మరో పదిరోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించారు. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు అంటే గంటపాటు తిరిగి ఎవరి
గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది. అయితే
తాజా కేబినెట్ సమావేశంలో పూర్తిగా ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు.