నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలి

     కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

కోరుట్ల,(ఆరోగ్యజ్యోతి): ఆరోగ్య శాఖలో పని చేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ వర్తింపజేయాలని వైద్య అధికారి ఇ ఇ డాక్టర్ అనిల్ ఆరోగ్య విస్తీర్ణ అధికారి రామ్మోహన్ అన్నారు. మంగళవారం భోజన విరామ సమయంలో అల్లా మయ్య గుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పి ఆర్ సి ని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు కూడా వర్తింప చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ధనుంజయ్ భూషణం ఏ ఎన్ ఎం లో ఎస్ మధురిమ సౌజన్య రజిత సుమలత రాజేశ్వరి సరోజ బాలామణి ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.