వైద్య ఉద్యోగులకు వేతనాలు పెంచలని - నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు

     కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): వైద్య ఉద్యోగులకు వేతనాలు పెంచలని - నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలుచేయడం జరుగుతుందని వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక జిల్లా చైర్మన్ డాక్టర్ శ్రీధర్ మిత్పెల్లివర్ , కన్వీనర్ బండారి కృష్ణా లు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు రేపు భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించాలని వారు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కార్యక్రమం నిర్వహించాలని వారు కోరారు నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు నేషనల్ హెల్త్ మిషన్ తో పాటు కొందరు వైద్యులు వేతనాలను పి ఆర్ సి ప్రకారం పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం భోజన విరామ సమయంలో నిర్వహించే నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు.