కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో 15 సంవత్సరాలుగా పని
చేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే
పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు
ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు సోమవారంనాడు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా
ఆ సంఘం జిల్లా కార్యదర్శి నవీన్ కుమార్ , రెండవ ఏఎన్ఎం జిల్లా
నాయకులు కె విజయలక్ష్మి, ఆనంద్ బాయి ,సముద్రా లు మాట్లాడుతూ ప్రజలకు సేవలందించడంలో ముందున్నది
రెండవ ఏఎన్ఎం లేనని ఈ సందర్భంగా వారు తెలిపారు. చాలీచాలని జీతంతో పని చేస్తున్న
తమకు న్యాయం చేయాలని కోరినారు. 11వ పి ఆర్ సి లో రెండవ ఏఎన్ఎంలకు వేతనం పెంచాలేదని, సమాన పనికి సమాన వేతనం
ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. 15 సంవత్సరాల నుంచి వెట్టిచాకిరి చేస్తున్న
తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలని ఈ సందర్భంగా వారు డిమాండ్
చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి
సెలవులను ప్రభుత్వం మంజూరు చేయాలని వారు కోరారు. కరోనా సమయంలో లో వెట్టి చాకిరి
చేసి ప్రజలను కాపాడిన ఘనత ఆరోగ్య శాఖా ఉద్యోగులది అందులో
ముఖ్యంగా సెకండ్ ఏఎన్ఎంనని తెలిపినారు. ఈ కార్యక్రమంలో పి మమత, పి శకుంతల, ముంతాజ్ బేగం, వేణు తాయి, వి మమత, చంద్రకళ, సుజాత, అమృతా, మమత వివిధ ప్రాథమిక ఆరోగ్య
కేంద్రాలు సబ్ సెంటర్ల నుంచి వచ్చిన తదితరులు పాల్గొన్నారు.