కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాజీవ్
గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి ఆవరణలో గల తెలంగాణ
డయాగ్నస్టిక్స్ ముందు సిబ్బంది మొక్కలు నాటినారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సంఘాల
ఐక్యవేదిక కన్వీనర్ బండారి కృష్ణా మాట్లాడుతూ తెలంగాణ డయాగ్నొస్టిక్ ముందు చెట్లు
నాటు సంతోషకరమైన విషయం అన్నారు .తెలంగాణ ప్రభుత్వం కూడా చెట్లు నాటే హరితహారం
కార్యక్రమాన్ని తీసుకు వచ్చిందని తెలిపారు. కొత్తగా ప్రారంభమైన తెలంగాణ
డయాగ్నస్టిక్స్ ముందు పూలు పండ్లు నీడనిచ్చే చెట్లు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్
మేనేజర్ హరీష్, రఘురాం, ల్యాబ్ టెక్నీషియన్లు జీవన్, సుప్రజ తదితరులు
పాల్గొన్నారు.