పోలీస్ లకు రక్త నిర్ధారణ పరీక్షలు

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  984802545

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో బొల్లరపు సుధీర్ కుమార్ అడ్వకేట్ అద్వర్యంలో పోలీస్ సిబ్బందికి రక్త నిర్ధారణ పరీక్షలను శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎ ఆర్ అదనపు యస్ పి వినోద్ కుమార్ మాట్లాడుతూ లాక్ డౌన్ లో సేవలు అందిస్తున్న హోం గార్డు నుండి డి యస్ పి, ఎ యస్ పి వరకు దాదాపు 200 మంది పోలీస్ సిబ్బందికీ షుగర్, బి పి, ఆక్సిజన్ లెవల్ పరీక్షించుట తదితర రక్త నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. సుధీర్ కుమార్ ను పోలీస్ శాఖ తరపున అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్, రెడ్ క్రాస్ సొసైటీ తమ వంతు సహకారం అందించడం వారి సేవలకు అభి నందనాలు తెలియ చేసినారు.ఈ కార్యక్రమంలో డి యస్ పి లు వెంకటేశ్వర్లు, సురేష్, స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు పెంటపర్తి ఊశన్న, రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షుడు బాలశంకర్ కృష్ణ, వెంకన్న, దామోధర్, రమేష్ , మహేందర్ తదితరులు పాల్గొన్నారు.