కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
- వైద్య సేవలు వినియోగించుకొండి
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్
సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 11మంది సూపర్
స్పెషలిస్ట్ వైద్యులు విధుల్లో చేరారు. 11 విభాగాలను నాలుగు విభాగాల్లో కొంతమంది వైద్యులు విధుల్లో
చేరారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 11 విభాగాల గాను 52 మంది వైద్య పోస్టులు మంజూరుకాగా ఇందులో ఇప్పటి వరకు నాలుగు
విభాగాల్లో 11 మంది వైద్యులు విదుల్లో చేరినారు. మరో
41 మంది వైద్యులకు ఇంటర్వ్యూలు పెట్టవలసి ఉంది. రిమ్స్
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వివిధ పోస్టులకు గతంలో నోటిఫికేషన్ విడుదల చేశారు.
అయితే అందులో 20 మంది ఇంటర్వ్యూలకు హాజరు అయ్యారు.
అందులో 11 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. మరో
తొమ్మిదిమంది విదుల్లో చేరలేదు.సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉన్న విభాగాలను
పరిశీలించినట్లయితే కార్డియాలజీ, యూరాలజీ, న్యూరో సర్జన్, పేట్రియాటిక్ సర్జన్ ,రేడియాలజీ,
అనేస్తేసియలజీ, కార్డియో థెరపీ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, మెడికల్
గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ, విభాగాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం
కార్డియాలజీ డిపార్ట్మెంట్లో నాలుగు వైద్యులు విధుల్లో చేరారు. యూరాలజీ
డిపార్ట్మెంట్లో రెండు పోస్టులు ఉండగా ఇద్దరు వైద్యులు విధుల్లో చేరారు. న్యూరో
సర్జన్ లో రెండు పోస్టులు ఉండగా ఒక వైద్యుడు విధుల్లో చేరారు. పీడియాట్రిక్ సర్జరీ
లో రెండు పోస్టులు ఉండగా ఇద్దరు వైద్యులు విధుల్లో చేరారు. సి ఏ ఎస్, ఆర్ ఎన్ వో
పోస్టులు 4 మంజూరు ఉండగా అందులో ఒకరు వైద్యులు విధుల్లో
చేరారు.సి ఎన్ వో పోస్టులు 12 మంజూరు ఉండగా ఒకరు మాత్రమే విధుల్లో
చేరారు.
వైద్య సేవలు వినియోగించుకోండి
- రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కరుణాకర్
రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 11 మంది వైద్యులు విధుల్లో చేరినట్లు రిమ్స్ డైరెక్టర్, ఆసుపత్రి సుపరిండెంట్ డాక్టర్ కరుణాకర్ “ఆరోగ్యజ్యోతి”కి తెలిపారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభంకానందున విడుల్లో చేరిన 11 మంది వైద్యులు రిమ్స్ పాత ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారని తెలిపారు. కార్డియాలజీ ఈ విభాగంలో నలుగురు వైద్యులు విధుల్లో చేరినారని, వీరు జనరల్ మెడిసిన్ ఓపి లో అందుబాటులో ఉంటారని తెలిపారు. యూరాలజీ విభాగంలో ఇద్దరు వైద్యులు, న్యూరో సర్జన్ లో ఒకరు, పీడియాట్రిక్ సర్జరీలో ఇద్దరు వైద్యులు విధుల్లో చేరినారు. వీరు సర్జరీ విభాగంలో అందుబాటులో ఉంటారని డైరెక్టర్ తెలిపారు. ఈ సేవలను ఆదిలాబాద్ ప్రజలు వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు.