కనిపించని శత్రువుకు భయపడకుండా సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్న వైద్యులు

కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page  

- అధ్యక్షులు డాక్టర్ చేవూరుచిన్న

కావలి, (ఆరోగ్యజ్యోతి): జాతీయ వైద్యుల దినోత్సవం సందర్బంగా స్వచ్ఛంద సేవా సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డాక్టర్ గుండెమడుగుల దేవదానం మెమొరీయల్ వైద్యశాల ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు కి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంస్థ గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ భాష మాట్లాడుతూ డాక్టర్ ప్రభాకర్ నాయుడు నిస్వార్ధంగా,నిబద్దతతో సేవలు అందిస్తున్నారు,అపాయం ముంచుకోస్తుందని తెలిసినా వెన్ను చూపని నైజం వైద్యులదని  ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైద్య సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న  కరోనా బారిన పడిన వారిని రక్షించడానికి రాత్రీ పగలు తేడా లేకుండా శ్రమిస్తున్నారని కనిపించని శత్రువుకు భయపడకుండా కుటుంబాలను వదిలి సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్నారు అని ఆయన అన్నారు.ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ చేవూరుచిన్న మాట్లాడుతూ వైద్యులు దేవుళ్ళతో సమానం అంటారు. కరోనా ప్రజలను వణికిస్తున్న విపత్కర పరిస్థితులల్లో సేవలు అందించడానికి ఏ మాత్రం వెనుకంజ వేయని వైద్యులు నిజంగానే దేవుళ్ళతో సమానమని నిస్వార్ధంగా వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి వందనం అభివందనమని అలాంటి వైద్యులందరికి మరోసారి  జాతీయ వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ఆయన అన్నారు,ప్రధాన కార్యదర్శి మొఘల్ సలీం బేగ్, సలహా దారు మాలకొండారెడ్డి మాట్లాడుతూ కావలి మరియు పరిసరాల ప్రజలతో విడరాని బంధం ఏర్పడి, అనుబంధంగా.ప్రేమానుబంధంగా,అనురాగబంధంగా, ఆత్మీయబంధంగా ఏర్పడినపిదప విడరానిబంధంగాఏర్పడినది. అంత గొప్ప వ్యక్తిని మా స్వచ్చంద సేవా సంస్థల ఐక్యవేదిక ద్వారా సత్కరించటం ఆనందంగా ఉందని ఆ భగవంతుడు డాక్టర్ ప్రభాకర్ నాయుడుకి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ప్రసాధించి మరెన్నో వైద్య సేవలు చేసేవిధంగా శక్తీని ఇవ్వాలని హృదయ పూర్వకముగా కోరుకుంటున్నాము.