జనాభాను తగ్గించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page

- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేంద్ర

- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేంద్ర

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు జనాభా పెరుగుతుందని భారతదేశంతో పాటు చైనా లాంటి దేశాల్లో జనాభా అధికంగా ఉండటం వల్ల ఆ దేశాలకు ఎంతో నష్టం కలిగిస్తుందని జనాభాను తగ్గించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేంద్ర అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతు 1987 జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరిందని అందువల్ల ఆ రోజును ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న జనాభాలో 35 శాతానికి పైగా భారతదేశం,చైనాలో  జనాభా ఉందన్నారు. ప్రపంచ జనాభా 2020 మార్చి నాటికి 970 కోట్లు ఉందన్నారు. 2055 నాటికి వెయ్యి కోట్ల జనాభా చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జనాభా తగ్గించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు ముఖ్యంగా ఆపరేషన్లు చేయించాలని సిబ్బందికి సూచించారు . ట్యూబెక్టమీ ఆపరేషన్ లకు బదులుగా ఆపరేషన్లు కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పీపీ యూనిట్ తోపాటు అర్బన్ హెల్త్ సెంటర్లలో కూడా ఆపరేషన్ కొరకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గతంలోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశామని తెలిపారు. కరోనా కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం జరిగిందని ఆయన సూచించారు. త్యుబెక్టమి  ఆపరేషన్ చేయించినట్లయితే ఆడవారు పది నుంచి పదిహేను రోజుల వరకు ఇంట్లో ఉండవలసి వస్తుంది. అని అందుకే మగవారికి వేసేక్టమి ఆపరేషన్ చేయించాలని సూచించారు. కార్యక్రమం అనంతరం కుటుంబ నియంత్రణ  ఆపరేషన్లకు సహకరించిన ఉద్యోగులకు అవార్డులను అందజేశారు . కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎక్కువగా చేసినందుకు లను జిల్లా సర్వేలెన్స్  అధికారి డాక్టర్ వై సి శ్రీనివాస్ కు సర్టిఫికెట్ ప్రధాన చేశారు. అలాగే సూపర్వైజర్ నిర్మల కుమారి. తో పాటు ఆరోగ్య కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు అవార్డులు అందజేశారు.అలాగే ఒక బిడ్డ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళ కూడా వెయ్యి రూపాయల చెక్కు అందజేశారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి.ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు 5 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు తీసుకువచ్చి నట్లయితే పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయిస్తానని జిల్లా గణకల అధికారి బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. జనాభాను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు తనవంతుగా ఐదు ఆపరేషన్లు చేస్తే సొంత ఖర్చులతో ఇన్సూరెన్స్ చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలోడిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సాధన, జిల్లా సర్విలేన్స్ అధికారి డాక్టర్ వై సీ శ్రీనివాస్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయ సారథి, అడిషనల్ డిఎంహెచ్ఓ ఎయిడ్స్ లెప్రసీ జిల్లా అధికారి డాక్టర్ శ్రీకాంత్ మెట్పల్లి వార్, జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వార్, జిల్లా కుటుంబ నియంత్రణ అధికారి డాక్టర్ నవ్యసుధా, ఎన్ సి డి అధికారి డాక్టర్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.