ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించడం సంతోషకరం

    కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

-      జిల్లా కలెక్టర్ సిక్త  పట్నాయక్

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రిమ్స్ ఆస్పత్రిలోని ఆర్ బి ఎస్ కె మరియు డైస్  అద్వర్యంలో లో చిన్న పిల్లలకు ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించడం సంతోషకరమైన విషయమని జిల్లా కలెక్టర్ సిక్త  పట్నాయక్ అన్నారు. ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య శిబిరం వల్ల చిన్నారులకు గుండె సమస్యలు బయటపడతాయని తెలిపారు ఎందరో పేదలకు వైద్యం ఉపయోగపడుతుందని సూచించారు .141 మంది గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ శిబిరానికి రావడం వల్ల జబ్బులు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆపరేషన్స్ ఇతర సమస్యలు ఉంటే బయటపడతాయని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ మాట్లాడుతూ ఆర్ బి ఎస్ కె ద్వారా చిన్నారులకు అన్ని రకాల వైద్య శిబిరాలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఒక గుండె జబ్బులు కాకుండా అన్ని రకాల వ్యాధులను చికిత్సలు అందించడం జరుగుతుందని ఇక్కడ వైద్య చికిత్సలు కానట్లయితే హైదరాబాద్ లాంటి నగరాలకు పంపించడం జరుగుతుందని తెలిపారు రిమ్స్ హాస్పిటల్ 2వ అంతస్థులో జరిగిన గుండె వైద్యశిభిరానికి భారీ స్పందన లభించింది 141మంది ఓ పి వచ్చారు.అందులో అపోలో హాస్పిటల్స్ డా.కవిత చింతాల  పిడియాట్రిక్ కార్డియోలాజిస్ట్,డా. సునీల్ కుమార్ స్వైన్  కార్డియాక్ సర్జన్  వారి బృందం రిమ్స్ లోని RBSK/DEIC  వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గుండె వైద్య పరిక్షలు చేసినారు. ఈ శిభిరానికి ఉమ్మడి జిల్లా  నలుమూలనుండి అప్పుడే పుట్టిన పిల్లలుమొదలుకొని 18సం. పిల్లలవరకు 141వరకు పేషేంట్ రాగ  ఇందులో 13 వరకు హార్ట్ సర్జరీ అవసరం అని అలాగే  19డివైస్ క్లోస్, కార్డియ్యక్ క్యాత్  మెడికల్ మానేజ్మెంట్ 50 అవసరం అని  చిన్నారుల్లో పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఏర్పడిన పేద వర్గాలకు చెందిన చిన్నారులకు   ఉచితంగా అపోలో ఆసుపత్రిలో గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని వైద్య బృందం  వివరించారు . కార్యక్రమం లో జిల్లా RBSK సమన్వయ కర్త డా.విజయ సారధి , మేనేజర్ జావింద్, డా. రాధికా, స్రవంతి, స్పెషల్ ఎడ్యుకేటర్  దొంతుల ప్రవీణ్, రాoచందర్,నవ్య,ఉమాకాంత్, జక్కి నవీన్ వివిధ ఉమ్మడి జిల్లాల MHT డాక్టర్స్ శ్రీకాంత్,సోహైల్, వీణసాగర్ ఫార్మాసిస్ట్ ANM మరియు సిబ్బంది పాల్గొన్నారు.