బడిగూడా గ్రామంలో వైద్య శిబిరం

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

ఇచ్చోడ,ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): మండలంలోని బడిగూడా గ్రామంలో శనివారం నాడు వైద్య శిబిరం నిర్వహించినట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సాగర్ తెలిపారు. వర్షాకాలం కావడం వల్ల వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. వైద్య శిబిరం లో అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందించడంతో పాటు మందులను పంపిణీ చేశారు. గర్భిణీలకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ క్యాల్షియం,విటమిన్స్ లాంటి మాత్రలు ఇవ్వడంతోపాటు గర్భవతులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇంటి ఆవరణలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్త,ఉండకుండా చూసుకోవాలని సూచించారు. వర్ష కాలంలో ఎక్కువగా మలేరియా, అతిసార, డెంగు లాంటి వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని ఒకవేళ వ్యాధులు వస్తే గ్రామంలో గల ఆశా కార్యకర్తలు కానీ, ఆరోగ్య కార్యకర్తలకు ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి చికిత్స పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ సింగ్ , రాజ్ కిరణ్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.