కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
వరంగల్ అర్బన్ ,(ఆరోగ్యజ్యోతి): వరంగల్
లో బ్రేకింగ్ ద బ్యారియర్స్ ప్రాజెక్ట్
మరియు క్షయ నివారణా కార్యాలయం వరంగల్ అర్బన్ వారితో కలిసి వరంగల్ అర్బన్ జిల్లాలో
గల పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న టీబీ నోడల్ సూపర్వైజర్ లకు టీబీ
పేషంట్స్ కేర్ అండ్ సపోర్ట్ గ్రూప్ మీటింగ్ పైన ట్రైనింగ్ స్థానిక ఐ ఎం ఏ హల్ లో
ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా క్షయ నివారణా అధికారి డాక్టర్
మల్లికార్జున్ హాజరైనారు. ఈ కార్యక్రమం లో బ్రేకింగ్ ద బ్యారియర్స్ ప్రాజెక్ట్
కోఆర్డినేటర్ విశాల్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలోని అన్ని ఏరియాల్లో నీ వల్నరబుల్
పాపులేషన్ ఎక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసి వారికి టీబీ వ్యాధిపై కమ్యూనిటీ లో
వున్నవారి సహకారంతో అవగాహన కార్యక్రమాలు, జిల్లా క్షయ నివారణా
కార్యాలయం వారితో కలిసి వైద్య శిభిరాలు ఏర్పాటు బ్రేకింగ్ ద బ్యారియర్స్
ప్రాజెక్ట్ ద్వారా టి బి అంతం కోసం పని
చేస్తున్నాము అని బి టి బి ప్రాజెక్ట్ గురించి వివరించారు. ఈ
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా క్షయ నివారణా అధికారి డాక్టర్
మల్లికార్జున్ మాట్లాడుతూ టీబీ నీ అంతం చేయాలంటే అందరి సహకారంతో అవసరమని
చెప్పారు.ముఖ్యంగా పేషంట్స్ కరెక్ట్ గా మందులు వాడేలాగా వారి కిందిస్తాయిలో పాలో
అప్ అవసరమని వారితో కలివిడిగా వుండి వారి భాదను అర్థం చేసుకొని వారికి మానవతా
దృక్పథంతో సహకారం అందించడం వలనే వారు మందులు క్రమం తప్పకుండా వాడతారని చెప్పారు.మన
జిల్లాలో టీబీ వ్యాధి ఉన్నవారు మంచి ఫలితాలు సాధించాలంటే ప్రతి పట్టణ ప్రాధమిక
ఆరోగ్య కేంద్రాలలో వున్న అందరి టీబీ గోలీలు వాడే వివరాలు తెలుసుకొని వారికి ప్రతి
నెల, నెలలో వోకసారి టీబీ పేషంట్స్ కేర్ అండ్ సపోర్ట్ గ్రూప్
మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ ఫరిదిలో వున్న టీబీ గోలీలు వాడే వారందరినీ పిలిచి ఆ
రోజు మెడికల్ ఆపీసర్ తో పరీక్షించడం,టీబీ ట్రీట్మెంట్
ఆవశ్యకతను, వారికి వున్న సైడ్ ఎఫెక్ట్స్ గురించి,వారి యింట్లో వున్నవారికి ఏమైనా లక్షణాలు వున్నాయో లేదో
తెలుసుకోవాలి,వారి యిండ్లలో చిన్నపిల్లలు వుంటే వారికి టీబీ వ్యాధి
రాకుండా మందులు పెట్టడం,మరియు ప్పోష్టిక ఆహారానికి
ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన డబ్బులను వచ్చెలాగా చేయడం,అంతే కాక అసలే లేని పేషంట్స్ కొరకు మన ఏరియాలో ఎవరైనా
దాతలు వుంటే వారిద్వారా సహాయం చేయించడం ద్వారా టీబీ గోలీలు వాడే వారు మంచిగా వాడి
ఆ వ్యాధి నుండి బయట పడతారని.కాబట్టి అందరూ ప్రతి పట్టణ ప్రాధమిక ఆరోగ్య
కేంద్రాలలో పేషంట్స్ కేర్ సపోర్ట్ గ్రూప్
మీటింగ్ లు క్రమం తప్పకుండా నిర్వహించి ట్రీట్ మెంట్ సక్సెస్ రేట్ పెరిగేలా
చేద్దాం టీబీ వ్యాధిని నిర్మూలిద్దాం.ఈ కార్యక్రమం లో బి టి బి ప్రాజెక్ట్
కమ్యూనిటీ కోఆర్డినేటర్ ప్రభాకర్, ప్రశాంత్,జిల్లా క్షయ నివారణా కార్యాలయ సిబ్బంది,మరియు వరంగల్ అర్బన్ లో గల పట్టణ ప్రాధమిక ఆరోగ్య
కేంద్రాల టీబీ నోడల్ సూపర్వైజర్ లు పాల్గొన్నారు.