గిరిజన ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం

కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page  

గిరిజన ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): గిరిజన గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల సహకారం సేవలు ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్ పట్నాయక్ అన్నారు. సేల్స్ ఫోర్స్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో రీమ్స్ పిల్లల వార్డులో 10 బెడ్  ఇంటెన్సివ్ కేర్ యూనిట్ శుక్రవారంనాడు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్   ప్రస్తుత కాలంలో మన దేశం లో 700 జిల్లాలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిందని ఆమె తెలిపారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో దేశంలోని కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ,ఉత్తరఖండ్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆరు జిల్లాల్లో పది బెడ్ ఐసియు లను ఏర్పాటు చేశారన్నారు. 700 జిల్లాలో సుమారు 44 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నీ పిల్లల వార్డులో 10బెడ్  ఐసియు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. ఆదిలాబాద్ లో ఎక్కువ గిరిజన నివసిస్తున్నారని ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సంస్థ ఎంపిక చేసిన ప్రాంతాల్లో అన్ని వెనుకబడిన ప్రాంతాలే నని  ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బలరాంనాయక్,నిర్మన్ స్వచ్ఛంద సంస్థ చీప్ ఆఫీసర్ రేఖ, తిరుపతి, అక్తర్, మేనేజర్  భూషణ్ రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్  వంశీ , ఎగ్జిక్యూటివ్ సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.