రిమ్స్ డైరెక్టర్ కి జేఏసీ ఆధ్వర్యంలో సన్మానం

కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

 ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆదిలాబాద్ డైరెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కరుణాకర్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మరియు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగులు జేఏసీ యాక్షన్ కమిటీ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం చైర్మన్ డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వార్, కన్వీనర్ బండారి కృష్ణ లు మాట్లాడుతూ రిమ్స్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని వీలైనంత తొందరలో పరిష్కరించాలని డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు .రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొరకు నోటిఫికేషన్ లో లిస్టు వెరిఫికేషన్ ఇంకా మూడు రోజుల వరకు పెంచాలని సూచించారు. చాలామందికి ఏం చేయాలో అర్థం కావడం లేదని సర్టిఫికెట్లు ఇతర విషయాలు పరిశీలించి మూడు రోజులు పెంచాలని కోరారు. లిస్టును విడుదల చేశారని అలాగే వెబ్ సైట్ లో ఉంచి పత్రికాముఖంగా అందరికీ అందుబాటులో ఉంచాలని కోరారు. కోవిడ్ కష్టకాలంలో ఎంతో సేవలందించిన స్టాప్  నర్సులను ప్రభుత్వం తొలగించిందని వీరిని మానవతా దృక్పథంతో ఆలోచించి వారిని తిరిగి విధుల్లోకి తీసు కొనే విధంగా చర్యలు చేపట్టాలని రిమ్స్ డైరెక్టర్ ను వారు కోరారు. ఈ కార్యక్రమంలో ట్రేజరర్ క్రాంతి కుమార్   ,వైస్ ప్రెసిడెంట్లులు  డాక్టర్ శ్రీకాంత్ మెట్పల్లి వార్, రామకృష్ణ ,సిడం వామన్ ,డాక్టర్ పవన్ అనిల్, రమణాచారి ,శ్రీకాంత్, రమేష్, రఘురాం, శ్రీనివాస్, నవీన్ ,తదితరులు పాల్గొన్నారు.