సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి

కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

  • యన్  హెచ్ ఎం ఉద్యోగులకు పిఆర్సి వెంటనే వర్తింపచేయాలి
  • నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
  • సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు తెలంగాణ పి ఆర్ సి లో వేతనాలు పెరగలేదని వెంటనే వేతనాలు పెచాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నవీన్ కుమార్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కే కిరణ్ జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ విజయలక్ష్మి లు అన్నారు. సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తొలి పి ఆర్ సి లో జీవో 60 ప్రకారం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని అన్నారు కానీ వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ లో ఉన్న ఉద్యోగులకు ఇంతవరకు వేతనాలు పెంచాలని అన్నారు వీరందరూ గత 22 సంవత్సరాలుగా వివిధ శాఖల్లో వివిధ హోదాల్లో పని చేస్తూ చాలీచాలని జీతాలతో ఉన్నారన్నారు కనీస ఉద్యోగ భద్రత లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు గత సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి తో పోరాటం చేస్తూ ప్రాణాలకు తెగించి పేదలకు సేవలందిస్తూ ఈ సందర్భంగా వారు తెలిపారు.నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) చాలా వరకు కేటగిరీల్లో మెడికల్ ఆఫీసర్లుస్పెషలిస్టులుస్టాఫ్ నర్సులుపారామెడికల్ సిబ్బందిఏ ఎన్ ఎం లుసెకండ్ ఏఎన్ఎంలుఅడ్మినిస్ట్రేషన్ స్టాప్ల్యాబ్ టెక్నీషియన్లుడి ఈ ఓ లుఫార్మసిస్ట్ లుఫైనాన్స్ఎం ఎన్ ఎల్ హెచ్ పి... ఈ ఈ హెచ్ ఓ లుఎన్ పి ఎం ల తోపాటు ఇతర ఉద్యోగులు పనిచేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం లో ఇబ్బంది పడుతున్నారని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం)  పనిచేస్తున్న ఉద్యోగులు అందరికీ వేతనాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరుకుంటున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు 2016లో పెంచాల్సిన వేతనాలను 2018లో 500 జీవో జీవో ప్రకారం నామమాత్రంగా పెంచారు రాష్ట్రంలో దాదాపు 12 వేల మందికి పైగా వివిధ కేటగిరీల్లో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) లో విధులు నిర్వహిస్తున్నారు. 51జీవో ప్రకారం కొంతమంది. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు వేతనం పెంచినారు. ఇదే  51జీవో ప్రకారం నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు వేతనం మూడు నుంచి నాలుగు వేల మందికి ఉద్దోగులకు ఇంక  2018 లో పెంచవలసిన  వేతనాలు ఇంక పెంచలేదని వారు ఆవేదన వ్యక్తం చేసినారు. పి ఆర్ సి లో మాత్రం వారికి నిరాశే మిగిలిందనారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేక జీవో విడుదల చేస్తూ నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) లో పనిచేస్తున్న ఉద్యోగులు అందరికీ వేతనాలు పెంచాలని సిబ్బంది  తెలంగాణా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.భారత అత్యున్నత న్యాయస్థానం 2016 అక్టోబర్ 31న శాశ్వత స్వభావం కలిగిన  పోస్టులలో శాశ్వత సిబ్బందిని నియమించాలని, సమాన పనికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు కోరారు ఉద్యోగులు గతంలో 8, 9, 10 పి ఆర్ సి  ప్రకారం అదే కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉద్యోగులందరికీ రెగ్యులర్ ఉద్యోగులు నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద బాయి , శకుంతల,ప్రశాంత్, రానిత, గోపాల్ తో పాటు వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన నేషనల్ హెల్త్ మిషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

డిమాండ్స్

  • Ø  నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
  • Ø  తెలంగాణలో తొలి పి ఆర్ సి ప్రకారం ఉద్యోగులకు వేతనాలు పెంచాలి అలాగే డి ఎ ఇతర అలవెన్సులు ఇవ్వాలి
  • Ø  వేతనంతో కూడిన ఒక వంద 80 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలి
  • Ø  ఈఎస్ఐ ప్రమాద బీమా ఉచితంగా ఆరోగ్య చికిత్స సౌకర్యాలు కల్పించాలి
  • Ø  ఫోటో ఉద్యోగులతో సమానంగా యూనిఫాం అలవెన్స్ ఇతర అలవెన్సులు ఇవ్వాలి
  • Ø  కోవిడ్ ఇన్సెంటివ్ వెంటనే చెల్లించాలి
  • Ø  నిత్యం లో పనిచేస్తున్న ఉద్యోగులు విధి నిర్వహణలో చనిపోయినట్లు అయితే ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి