కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్
గద్వాల్, రాజోలి,(ఆరోగ్యజ్యోతి): గర్భిణీ స్త్రీలు శిశువులు వ్యాధి
నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి
సూపర్ వైజర్ జయప్రకాశ్ అన్నారు.. రాజోలి మండల కేంద్రము లోని రాజోలి ఏ, బి, సి మూడు ఆరోగ్య ఉప
కేంద్రము లను ఆయన బుధవారంనాడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ
గర్భిణీ మహిళల కు, అలాగే శిశువులకు టీకాలు
తప్పనిసరిగా వేయించాలని అన్నారు. ఒక రోజు ముందుగా ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి
గర్భిణీ స్త్రీలు, శిశువుల వివరాలు నమోదు
చేసి ఎంత మంది ఉన్నారో వారినందరినీ తరలించి టీకాలు వేయించాలి అని ఆశాల కు సూచించారు.
గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలు పై వారికి అవగాహన కల్పించారు.
గర్భవతులు కాన్పు ఇంటి దగ్గర కాకుండా రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లోనే
కాన్పు కావాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి లో కాన్పు అయితే తల్లీ బిడ్డా క్షేమంగా
ఆరోగ్యంగా ఉంటారని ఆయన మాట్లాడుతూ అన్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వము కాన్పు
అయిన వారికీ కే సీ ఆర్ కిట్ తో పాటుగా ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇస్తుందని ఆయన
అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎన్ఎమ్ లు మద్దమ్మ, రెచల్, ఆశా వర్కర్లు సరస్వతి, విజయ లక్ష్మి, మంజుల, జయంతి తదితరులు
పాల్గొన్నారు.