సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అవకాశం కల్పించండి

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో పని చేస్తున్న 157 మంది స్టాఫ్ నర్సులను గురువారం నాడు అధికారులు తొలగించారు. ముందస్తు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆదిలాబాద్ లో 157 మందిని రాష్ట్రవ్యాప్తంగా 1640 మందిని తొలగించారు. ఆదిలాబాద్ లో పనిచేస్తున్న 157 మంది స్టాఫ్ నర్సులను నూతనంగా ఏర్పాటు కానున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అవకాశం కల్పించాలని అవుట్ సోర్స్  నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ అసిపోద్దిన్,  వైసే ప్రసిడెంట్లు  వెంకటేష్,పి. స్వప్న వర్కింగ్ ప్రసిడెంట్ వైశాలి, ట్రెజరర్ తాయమ్మ,వర్కింగ్ ప్రెసిడెంట్ వైశాలి,ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్. అశ్విని,తయమ్మ, కదిర్ లు  కోరినారు.ఏడాది పాటు ప్రాణాలకు తెగించి కోవిడ్  రోగులకు సేవలు అందించిన తమను ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించిన్దన్నారు. కరోన  సోకిన రోగికి బంధువులే రక్తసంబంధీకులు కూడా దగ్గరకు రాలేదని అలాంటి వారికి సేవలు మేము అందించామని తెలిపారు. కోవిడ్  సమయంలో మాత్రం ఎవరికీ తమ ప్రాణాలు గురించి పట్టించుకోలేదని సేవలందించిన మమ్ములను ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో  వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.