వైద్య ఆరోగ్య శాఖ లోపనిచేస్తున్న ఫార్మాసిస్ట్స్ సమస్యలు వెంటనే పరిష్క రించాలి.

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):తెలంగాణ గవర్నమెంట్ ఫార్మాసిస్ట్స్ అసోసియేషన్ ( TGPA )అద్వర్యం లో ఫార్మాసిస్ట్స్ సమస్యల పరిష్కరించాలని  కమిషనర్  వాకాటి కరుణ,డైరెక్టర్ అఫ్ హెల్త్  డాక్టర్ గడల  శ్రీనివాసరావు ని కలిసి  వినతి పత్రం సమర్పించారు. కాంట్రాక్టు ఫార్మాసిస్ట్స్ ని వెంటనే రెగ్యులర్ చేయాలన్నారు. NHM స్కిమ్ లో పనిచేస్తున్న ఫార్మాసిస్ట్స్   వేతనాలు పెంచాలని డిమాండ్ చేసినారు.ఫార్మాసిస్ట్స్ లకు వెంటనే ప్రమోషన్స్ ఇవ్వాలని కోరినారు.ప్రతి PHC లో అదనపు ఫార్మాసిస్ట్స్ పోస్ట్స్ మంజూరు చేయాలిని దోమొండ్ చేసినారు. ఫార్మాసిస్ట్స్ ని ఫార్మసీ ఆఫీసర్స్ గా పేరు మార్చాలన్నారు. సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.  ఈ కార్యక్రమం లోతెలంగాణ గవర్నమెంట్ ఫార్మాసిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్య దర్శులు రాగిరెడ్డి వీరారెడ్డి, బత్తిని సుదర్శన్ గౌడ్, వైద్య ఆరోగ్యసంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రతినిధులు డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి, డాక్టర్ కత్తి జనార్దన్, R.సుజాత, A సుజాత, శిరీష, భరత్ సత్యనారాయణ,  మంచాల రవీందర్,  డాక్టర్ కిరణ్, డాక్టర్ ప్రవీణ్, J సురేష్ కళ్యాణ్,సుజాత తెలంగాణ గవర్నమెంట్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి యాదయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు శిలువేరు ఉదయ్ ప్రసాద్, సెల్వరాని,జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు వంగ  సుధాకర్ రెడ్డి,  దేవాంభట్ల ప్రకాష్ రావు,వెంకట రమణ, రమాదేవి, సుజాత, శ్రీదేవి,  మానుపాటి రాజేందర్, కిరణ్, L.రాంచందర్ రావు,జంషేద్ అలీ, N. మల్లేశం, మసూద్ అలీ, నార్ల వేణు, సత్యవతి, అమరేందర్, మమతా, సదయ్య, నీరజ,  అఖిల్,సదయ్య, J.రమేష్,  సుధాకర్, ప్రేమ్ సాగర్, అవినాష్, యాదన్న, రెగ్యులర్, కాంట్రాక్టు, RBSK, UPHC, AYUSH, 104ఫార్మాసిస్ట్స్ లు తదితరులు పాల్గొన్నారు.

 

       * డిమాండ్స్*

  • Ø  ఫార్మసిస్ట్ Gr 2,Gr 1,సూపర్వైజర్స్ లను ఫార్మసీ ఆఫీసర్,సీనియర్ ఫార్మసీ ఆఫీసర్, జిల్లా ఫార్మసీ ఆఫీసర్  గా New Nomenclature మార్చడానికి  ఫైల్ DH గారు put up చేసి రెండు సం. లు అవుతుంది.వెంటనే ప్రభుత్వానికి పంపించాలి.
  • Ø  ఫార్మాసిస్ట్స్ గ్రేడ్ 2ని జిల్లా క్యాడర్ నుండి జోనల్ క్యాడర్ కి మార్చాలి.
  • Ø  ఈ ఔషధీ ప్రోగ్రాం కొరకు అదనపు ఫార్మసిస్ట్ పోస్ట్ ఇవ్వాలి.
  • Ø  కోల్డ్ చైన్ /ఈ విన్  ప్రోగ్రాం జిల్లా స్థాయిలో MPHS( M)చేస్తున్నారు.
  • Ø  PHC లలో కూడా వారికే ఆర్డర్స్ ఇవ్వాలి . లేదా అదనపు  ఫార్మాసిస్ట్స్ ని నియమించాలి.
  • Ø  జనరల్ ట్రాన్స్ఫర్స్ లో DH పరిధి నుండి DME కి DME పరిధి నుండి DH కి వెళ్ళడానికి ఆర్డర్స్ ఇవ్వాలి.
  • Ø  2001సం. నుండి పనిచేస్తున్న ఫార్మాసిస్ట్స్ అందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలి.
  • Ø  ఫార్మాసిస్ట్స్ 33సం. ల ఫై బడి సర్వీస్ చేసిన ఎటువంటి ప్రమోషన్ లేకుండానే రిటైర్ అవుచున్నారు. కావున ప్రతి ఫార్మసిస్ట్ కు అతని సర్వీస్ లో కనీసం (4)ప్రమోషన్స్ ఇవ్వాలి. (ఇతర రాష్ట్రాలలో ఇస్తున్న విధంగా )
  • Ø  ఫార్మాసిస్ట్స్ లకు సెపరేట్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి.
  • Ø  PCI నార్మ్స్ ప్రకారం ప్రతి ఫార్మసీ స్టోర్ ని Air  Condition చేసి  furniture కూడా ఏర్పాటు చేయాలి.
  • Ø  ఫార్మసీ ఉద్యోగానికి కనీస విద్యార్హత B.ఫార్మసీ ఉండాలి.
  • Ø  డ్రగ్ ఇన్స్పెక్టర్ /డ్రగ్ అనలిస్ట్ పోస్ట్ లకు  In service కోటా 40%ఇవ్వాలి.
  • Ø  CMS ల లో ఫార్మాసిస్ట్స్ ఇద్దరు ఉండాలి.
  • Ø  TSPSC ద్వారా సెలెక్ట్ అయిన కాంట్రాక్టు
  • Ø  ఫార్మాసిస్ట్స్ లకు వెంటనే ఆర్డర్స్ ఇవ్వాలి.
  • Ø  ప్రతి ఫార్మసిస్ట్ కు ప్రమోషన్ రానిచో అడ్ హాక్ ప్రమోషన్స్ ఇవ్వాలి.
  • Ø  అన్ని భస్తి దవాఖానాల్లో ఫార్మాసిస్ట్స్ పోస్ట్స్ ఇవ్వాలి.
  • Ø  హెల్త్ వెల్నెస్ సెంటర్స్ లలో ఫార్మాసిస్ట్స్ ని నియమించాలి.
  • Ø  510 G0 ప్రకారం NHM స్కిమ్ లో పనిచేస్తున్న RBSK,UPHC, AYUSH ఫార్మాసిస్ట్స్ కు రూ. లు 21,000 మాత్రమే ఇస్తున్నారు.11PRC ప్రకారం రూ. 31,040 ఇవ్వాలి.
  • Ø  104సర్వీస్ లో పనిచేస్తున్న (అవుట్  సోర్సింగ్)ఫార్మాసిస్ట్స్ లకు రూ. 17,500 మాత్రమే ఇస్తున్నారు. సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం రూ. 31040 ఇవ్వాలి.
  • Ø  కొన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్ గారు ఫార్మాసిస్ట్స్ లను నియమించు కున్నారు. కలెక్టర్  ఫండ్స్ నుండి  ప్రతి నెల రూ. 12,000మాత్రమే ఇస్తున్నారు. కొన్ని జిల్లాల్లో రూ. 21,000 ఇస్తున్నారు. వీరికి కూడా సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం రూ. 31,040 ఇవ్వాలి.