కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయండి

 

వరంగల్ అర్బన్,(ఆరోగ్యజ్యోతి): నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బిక్షపతి, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ రామ రాజేష్ కన్నా, ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ ,కార్యవర్గ సభ్యులు మూర్తి లు అన్నారు. ఈనాడు నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ సీసీ కి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్ లో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి పదకొండవ పిఆర్సి వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని వారు కోరారు.