కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
మంచిర్యాల్,(ఆరోగ్యజ్యోతి): నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు 11వ పిఆర్సి ప్రకారం వేతనాలు పెంచాలని ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో మంచిర్యాల్ లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ అనుబంధ సంఘం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ రాష్ట్ర అధ్యక్షులు రామ రాజేష్ కన్నా అధ్యక్షులు దాసు మేకల దాసు, అధ్యక్షులు దేవనబోయిన బాపు, ఆర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచిన విధంగానే పిఆర్సి ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. 510 జీవో ప్రకారం నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు చాలామందికి వేతనం పెరగలేదని వెంటనే వేతనాలు పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.