జగదేవ్‌పూర్, డిసెంబరు 26: లీవర్ సమస్యతో బాధపడుతున్న హర్షవర్ధన్‌కు నిమ్స్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. నిమ్స్ వైద్యులు హర్షవర్ధన్‌కు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. మండలంలోని మునిగడప గ్రామానికి చెందిన రాంచంద్రం, రజితల కుమారుడు హర్షవర్ధన్ లీవర్ సమస్యతో బాధపడుతున్న . వైద్యం ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ చెప్పడంతో హర్షవర్ధన్‌ను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఇప్పటికే అన్ని పరీక్షలు నిర్వహించారని, రెండు రోజుల్లో ఆపరేషన్ చేయడానికి వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకొని హర్షవర్ధన్ వైద్యసేవలను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు నిమ్స్ సూపరిండెంట్‌తో పాటు హర్షవర్ధన్‌కు వైద్యం అందిస్తున్న వైద్యులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు