కాకినాడ నగరం: కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసు పత్రిలో 17వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసిన నాలుగు రోజుల ఆడ శిశువును శుక్రవారం శిశుగృహకు అప్పగించారు. అనారోగ్యంతో ఉన్న శిశువుకు పిల్లలవార్డులో చికిత్స అందించి, కోలుకున్నాక శిశుగృహ మేనేజర్ కె.ప్రమీలకు జీజీహెచ్ వైద్యురాలు మాణిక్యాంబ చేతుల మీదుగా అప్పగించారు. పాపకు సంబంధించిన రక్త సంబంధీకులుగాని, బంధువులుగానీ తగిన ఆధారాలతో నెల రోజుల్లో వచ్చి తీసుకెళ్లాలని జిల్లా బాలల పరిరక్షణాధికారి సీహెచ్ వెంకట్రావు తెలిపారు. లేనిపక్షంలో పాపను చట్టబద్ధంగా దత్తత ఇస్తామని ఆయన వివరించారు.