పెదకాకాని, డిసెంబరు 23: రానున్న రోజుల్లో దంత వైద్యులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఎన్నారై అకాడమీ చైర్మన్ డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ తెలిపారు. సిబార్‌లో సోమవారం జరిగిన వార్షికోత్స వంలో ఆయన ప్రసంగించారు. సిబార్‌లో చదువుకున్న దంత వైద్యు లు ప్రపంచ దేశాల్లో స్థిరపడ్డారని తెలిపారు. సిబార్ డీన్ డాక్టర్ ఎల్. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నిష్ణాతులైన అధ్యాపకులను నియమించి విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నారన్నారు. అమెరికా వంటి దేశాల్లో దంత వైద్యులకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు.