చికిత్స పొందుతూ ఒకరి మృతి

రాయపోల్‌: ఇటీవల రాయపోల్‌ ఉన్నత పాఠశాల సమీపంలో మలుపు వద్ద  జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా వంగడాల్‌ గ్రామానికి చెందిన సుభాష్‌, మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన రాజు గాయపడ్డారు. ఈ క్రమంలో సుభాష్‌కు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. గురువారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రాయపోల్‌ ఎస్‌ఐ షేక్‌ మహబూబ్‌ తెలిపారు. మృతుడి మేనమామ సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.