అధికారుల నిర్వాకం
నాచారం: ప్రభుత్వ కార్యాలయాల చిరునామాను తెలియచేసే బోర్డులపై పాత జిల్లాల పేర్లే ఇంకా దర్శనమిస్తున్న చిత్రమిది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగి సంవత్సరాలు గడుస్తున్నా ఉమ్మడి జిల్లా పేరే ప్రధానమైన ఆసుపత్రి బోర్డుపై కొనసాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి వేరుపడి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఆవిర్భవించినా నాచారంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిపై పాతజిల్లా పేరునే ఉంచారు. జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా ఈ పరిస్థితి ఉండటం గమనార్హం. ఈ ప్రముఖ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలు అధికారుల వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి బోర్డుపై జిల్లాపేరు సరిచేయాలని వారు కోరుతున్నారు.