ఆశావర్కర్ల సమ్మె నోటీసు

రింగురోడ్డు, డిసెంబరు 24: ఆశా వర్క ర్లను కార్మికులుగా గుర్తించిన కనీస వేతనాలు సామాజిక భద్రత కల్పించాలని కోరుతూ జన వరి 8న సమ్మెలో పాల్గొన్ననున్నట్టు ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ అధ్యక్షురాలు బి.సుధారాణి తెలిపారు. సమ్మె నోటీసును మంగళవారం విజయనగరంలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌ సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆశా వర్కర్లకు కనీస వేతనం నెలకు రూ.21 వేలు చెల్లించాని డిమాండ్‌ చేశారు. 60 ఏళ్లు వయ స్సు వచ్చేవరకు పనిచేయించుకుని ఆశా వర్కర్ల కు ప్రభుత్వ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ సౌకర్యం కల్పించకుండానే తొలగించడం సరైంది కాదన్నా రు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు, అనారో గ్యంతో చాలామంది ఆశా వర్కర్లు అర్ధాంతరం గా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వీఎస్‌ఏ రత్నం, పద్మ, రాధ తదితరులు పాల్గొన్నారు.