హైదరాబాద్: కరీంనగర్, వరంగల్ పట్టణ, ఖమ్మం జిల్లాల వైద్య ఆరోగ్య అధికారుల(డీఎంహెచ్‌వో)ను ప్రభుత్వం బదిలీ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు సోమవారం నిర్ణయం తీసుకున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. వీరిని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో సివిల్ సర్జన్ ఆర్‌ఎంవోలుగా నియమిస్తూ అంతర్గతంగా ఉత్తర్వులు జారీచేసినట్లు సమాచారం. ఈ మూడు జిల్లాలకు కొత్త జిల్లా వైద్యాధికారులను మంగళవారం ప్రకటించే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి.