విషమంగానే విశ్వేశతీర్థ ఆరోగ్యం

ఉడుపి: పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్లు మణిపాల్‌ వైద్యులు తెలిపారు. బుధవారంతో పోలిస్తే ఆరోగ్య పరిస్థితిలో గురువారానికి పెద్దగా మార్పులేదని చెప్పారు. మఠాధిపతి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు వివరాల్ని వెల్లడించారు. కృత్రిమంగానే ఇప్పటికీ శ్వాసను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. న్యుమోనియా కొద్దిగా నయమైనప్పటికీ శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌ పూర్తిగా నయం కాలేదని తెలిపారు.