పిల్లలందరికీ పోలియో మందు వేయాలి

గద్వాల టౌన్‌: 0-5 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరికీ పల్స్‌పోలియో మందు తప్పక వేయాలని ఎస్‌ఎంవో డాక్టర్‌ ప్రగత్‌ సూచించారు. జనవరి నెలలో నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమంపై జిల్లా కేంద్రం గద్వాలలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో పీహెచ్‌సీల మెడికల్‌ ఆఫీసర్లు, రూట్‌ సూపర్‌వైజర్లకు సోమవారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ జనవరి 20, 21 తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతీ ఇంటిని సందర్శించి పిల్లలకు మందు వేయాలని సూచించారు. అనంతరం ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ సునీత మాట్లాడుతూ పోలియో మందు పంపిణీలో నిర్లక్ష్యం వహించరాదని అధికారులు, సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా హైరిస్క్‌ ఏరియాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె తెలిపారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ శశికళ, సీహెచ్‌వో రామకృష్ణ, హెచ్‌ఈవో నరేంద్రబాబు, తిరమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.