పిడుగురాళ్ల : ప్టాస్టిక్ నిషేధ విషయం ప్రతి ఇంటికీ తెలియజేయాలని కమిషనర్ వెంకటేశ్వర్లు చెప్పారు. మంగళవారం పురపాలకసంఘం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై భారీప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వలన క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు. యాభై మైక్రాన్లు పైన కవర్లు వినియోగించే వ్యాపారులు లైసెన్సు తీసుకొని నెలకు రూ.నాలుగు వేలు చెల్లించాలని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి వారం ప్లాస్టిక్ నిషేధంపై పాఠశాల, కళాశాల విద్యార్థులతో ప్రదర్శనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రోడ్లు భవనాల అతిథి గృహం దగ్గర నుంచి పురపాలక సంఘం సిబ్బంది, వార్డు వాలంటీర్లు, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రదర్శనగా బయలుదేరి బ్యాంకు సెంటర్ దాకా వెళ్లారు. అక్కడి నుంచి పాత కోర్టు భవనం దాకా వెళ్లారు. అక్కడి నుంచి మరలా రోడ్లు భవనాల అతిథి గృహం దాకా వచ్చారు. ప్రదర్శనలో పురపాలక మేనేజర్ ఎన్వీ ప్రసాద్, పారిశుద్ధ్య అధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.