గుంటూరు : ప్రభుత్వాసుపత్రుల్లో మాతా శిశు సంరక్షణ యాప్‌ను విధిగా వినియోగించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి యాస్మిన్ సూచించారు. డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి గురువారం వైద్యాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా యాస్మిన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈ యాప్‌ను కాన్పులు నిర్వహించే అన్ని ఆసుపత్రుల్లోనూ వాడుకలోకి తేవాలన్నారు. మాతా శిశు మరణాలను నివారించేందుకు దీనిని రూపొందించినట్లు తెలిపారు. అందువల్ల యాప్‌లో వివరాలను ఎప్పటికప్పుడు నమోదయ్యేలా పర్యవేక్షించాలన్నారు. దీనివల్ల కాన్పు అనంతరం జననీ సురక్ష యోజన(జేఎస్‌వై) కింద చెల్లించే రూ.1000 లబ్ధిదారుల ఖాతాల్లో 24 గంటల్లో జమ చేసేవిధంగా చూస్తారన్నారు.