విశాఖ: విశాఖ మన్యం.. రహదారైనా లేని కొండల్లో ఓ నిండు గర్భిణి పండంటి మగ బిడ్డను ప్రసవించింది.... అర్ధరాత్రి జి.మాడుగుల మండలం బీరం పంచాయతీ తల్మరంగి కొండల్లో ఓ నిండు గర్భిణి పురుటి నొప్పులతో బాధ పడుతుంది. కొండపైకి బైక్ అంబులెన్సు కూడా వెళ్లే మార్గం లేకపోవడంతో స్ట్రెచర్ పై గర్భిణీ ని రెండు కిలోమీటర్లు రోడ్డు వద్దకు మోసుకొచ్చారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. బైక్ అంబులెన్స్ వైద్య నిపుణుడు, స్థానిక ఆశ కార్యకర్త వైద్య సేవలు అందించారు. అర్ధరాత్రి చలిలోనే బైక్ అంబులెన్స్ లోనే గర్భిణీ చిన్నమ్మి పండంటి మగ బిడ్డను కన్నది. ఇద్దర్నీ జి.మాడుగుల ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. అర్ధరాత్రి చలిలో స్ట్రెచర్ పై మోసుకొచ్చి అంబులెన్స్ ద్వారా వైద్య సేవలు అందించిన వైద్య టెక్నీషియన్ రాజును మహిళ కుటుంబ సభ్యులు అభినందించారు.