ఆరోగ్యంగా ఉంటేనే మంచి ఆలోచనలు

కరీంనగర్‌ : మారుతున్న కాలానుగుణ పరిస్థితులను గమనించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అప్పుడే ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయని ప్రముఖ కథా రచయిత తుమ్మేటి రఘోత్తంరెడ్డి అన్నారు. గురువారం అల్ఫోర్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ రచయితల వేదిక కథా రచన కార్యశాల ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దశాబ్ద కాలంగా మందులతో పండించిన ఆహారం తీసుకోవడంతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు.