కందనూలు, డిసెంబరు 23 : ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసు కోవాలని సోమవారం బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీ నర్ అరవిందాచారి డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రు ల్లో ప్రజలకు ఎన్నో వసతులు ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. రోగులకు అవసరం లేకపో యినా గ్లూకోజ్‌లు పెడుతున్నారని, డయాగ్నోస్టిక్ సెంటరు, సిటీ స్కానింగ్ లను నిర్వహిస్తూ ప్రజల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న విష యాన్ని డీఎంహెవో దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఫీజుల పట్టిక ప్రైవేట్ ఆసు పత్రుల వారు నోటీస్ బోర్డుపై ప్రదర్శించడం లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షణ జరిపి ప్రజల నుంచి అధిక ఫీజుల వసూలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు.