ఊట్కూర్ : ప్రతి ఒక్కరూ హెచ్‌ఐవీ పట్ల అవగాహన కలిగి ఉండాలని డీఎంహెచ్‌వో సౌభాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం మండలంలోని పులిమామిడి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజలకు క్షయ, హెచ్‌ఐవీ పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి డీఎంహెచ్‌వో హాజరై మాట్లాడుతూ అవగాహనే హెచ్‌ఐవీకి అసలైన ఔషధమని పేర్కొన్నారు. రక్షణ లేని లైంగిక సంబంధాల ద్వారా హెచ్‌ఐవీ విస్తరిస్తుందన్నారు. ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారికి ఉపయోగించిన సిరంజీలు, వాడిన బ్లేడులను ఇతరులకు వాడితే ఈ వ్యాధి సోకే ప్రమా దం ఉందన్నారు. హెచ్‌ఐవీ మెదటి దశలో ఫ్లూ జ్వరం వస్తుందని, రెండో దశలో వ్యాధి ఉనికి తెలుస్తుందని, మూడో దశలో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా తగ్గుతుందని, నాలుగో దశలో దీర్ఘకాలిక జ్వరం, నీళ్ల విరోచనాలు, శరీర బరువు కోల్పోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. లైంగిక సంబంధాల్లో కండోమ్‌లు వాడటం ద్వారా వ్యాధి సోకకుండా అరికట్టవచ్చని తెలిపారు. ఎయి డ్స్ రోగులను అసష్యించుకోకుండా ఆదరించాలని, వ్యాధిగ్రస్థులు మందులతో ఆరోగ్యవంతమైన జీవితం గడపచ్చని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా పరీక్షలు, మందులు పొందవచ్చని ప్రభుత్వ వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీబీ పీఏ రా ఘవేందర్, డాక్టర్ నరేష్‌చంద్ర, హన్మం తు, సూపర్‌వైజర్ సురేశ్, ఏఎన్‌ఎంలు చిట్టెమ్మ, లక్ష్మి, భాగ్యతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.