రాయచోటి / కేవీపల్లె: తండ్రికి మదుమేహం.. కాలుకు పుండైంది.. అతడు అలా బాధపడుతుండడం చూడలేక చికిత్స చేయించేందుకు కుమారులు రాయచోటి నుంచి తిరుపతిలోని రుయా ఆసుపత్రికి కారు లో తీసుకుకెళ్లారు. వైద్యుడిని సంప్రదించగా కాలు తీసివేయాలని చెప్పారు. ఈ విషయాలపైనే బాధపడుతూ తిరుగు ప్రయాణం చేస్తు న్న ఆ కుటుంబాన్ని ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు ముంచుకొచ్చి ఐదుగురు ప్రాణాలను హరించింది.