ఆదోని : పట్టణంలోని మేదర వీధిలో శనివారం సేవాభారతి సంస్థ ఆధ్వర్యంలో హోమియోపతి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ప్రబలకుండా ఉండేందుకు ముందస్తుగా కాలనీవాసులకు మందులు అందజేశామని నిర్వాహకులు రమేశ్ తెలిపారు. ప్రస్తుతం పట్టణ వ్యాప్తంగా విషజ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పురపాలక అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. కార్యక్రమంలో కాలనీ వాసులు నల్లారెడ్డి, వీరేశ్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.